వీర్యదానంలో రికార్డులు సృష్టిస్తున్న బ్రిటన్ వాసి క్లివ్ జోన్స్
- అతడి వీర్యదానంతో 129 మంది జననం
- తల్లి గర్భంలో తొమ్మిది మంది
- 150 మంది లక్ష్యాన్ని చేరుకుంటా
- తల్లుల సంతోషాన్ని చూస్తే తెలుస్తుంది..
‘‘ప్రపంచంలో నేను అత్యంత ఫలప్రదమైన వీర్య దాతను. ఇప్పుడు 138 మంది బేబీలకు నేను తండ్రిని. ఇప్పటికే 129 మంది నా వీర్య దానం ద్వారా జన్మించారు. మరో 9 మంది తల్లి గర్భంలో ఉన్నారు. నేను మరికొన్నేళ్ల పాటు నా కార్యక్రమాన్ని కొనసాగిస్తాను. మొత్తానికి 150 బేబీల లక్ష్యాన్ని చేరుకుంటాను’’ అంటూ బ్రిటన్ కు చెందిన 66 ఏళ్ల క్లివ్ జోన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
‘‘క్లినిక్ లు, వీర్య వర్తకులకు నా కంటే ఎక్కువ సంఖ్యే ఉండొచ్చు. కానీ, వారు దాతలు కాదు. వీర్యాన్ని విక్రయిస్తుంటారు. సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తల్లులు పంపించే సందేశాలు, బేబీల ఫొటోలను చూస్తే ప్రజలు మరింతగా నన్ను అర్థం చేసుకుంటారు. నేను ఇదంతా ఉచితంగానే చేస్తున్నా. కాకపోతే కొన్ని సందర్భాల్లో పెట్రోల్ కోసం కొంత తీసుకుంటాను’’ అని క్లివ్ జోన్స్ తెలిపాడు.
కొందరికి పిల్లలను కలిగి ఉండడం ఎంతో ముఖ్యమైన విషయంగా ఆయన చెప్పాడు. ‘‘పిల్లల్లేని వారి దుస్థితి గురించి నేను వార్తా పత్రికల్లో చదవివాను. ఫేస్ బుక్ ద్వారా అంగీకారాలు కుదుర్చుకోవడం గురించి తెలుసుకున్నాను. దాంతో సాయం చేయాలని తలంచి నేను కూడా ఒక పోర్టల్ లో పోస్ట్ పెట్టాను. దాంతో డెర్బీ నుంచి ఒక మహిళ నన్ను సంప్రదించింది. అంతే.. ఆ తర్వాత ఇన్నేళ్లుగా నేను ప్రకటనలు ఇచ్చింది లేదు. కానీ, నేడు ఎంతో మంది నన్ను సంప్రదిస్తుంటారు’’ అని వివరించాడు ఈ వీర్యదాత.