అఖిలపక్షం ఆధ్వర్యంలో నేడు హిందూపురం బంద్!
- శ్రీసత్యసాయి జిల్లాకు పుట్టపర్తిని కేంద్రంగా ప్రకటించిన ప్రభుత్వం
- జిల్లా కేంద్రంగా హిందూపురంను ప్రకటించాలని అఖిలపక్షం డిమాండ్
- సత్యసాయి జిల్లా కేంద్రంగా హిందూపురం ఉండాలని విన్నపం
ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా రెండు జిల్లాలుగా విడిపోనుంది. అనంతపురం కేంద్రంగా అనంతపురం జిల్లా, పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఈ నిర్ణయంపై హిందూపురం ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
హిందూపురంను సత్యసాయి జిల్లా కేంద్రంగా చేయాలని ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాకు సత్యసాయి పేరు పెట్టడంపై తమకు అభ్యంతరం లేదని... అయితే, జిల్లా కేంద్రంగా హిందూపురంను ప్రకటించాలని పట్టణవాసులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ... ఈరోజు హిందూపురం బంద్ కు అఖిలపక్షం పిలుపునిచ్చింది.