కిన్నెర వీణ కళాకారుడు మొగిలయ్యకు ఇంటి స్థలం, రూ.1 కోటి నగదు ప్రకటించిన సీఎం కేసీఆర్

  • భీమ్లా నాయక్ లో పాట పాడిన మొగిలయ్య
  • కిన్నెర వీణతో ప్రాచుర్యం
  • జాతీయస్థాయికి మొగిలయ్య కళా నైపుణ్యం
  • పద్మశ్రీ ప్రకటించిన కేంద్రం
  • ప్రగతిభవన్ లో కేసీఆర్ ను కలిసిన మొగిలయ్య
పవన్ కల్యాణ్ చిత్రం భీమ్లా నాయక్ లో పాట పాడడంతో కిన్నెర వీణ కళాకారుడు మొగిలయ్య పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 12 మెట్ల కిన్నెర వీణపై ఆయన పలికించే సంగీతం జాతీయస్థాయిలో గుర్తింపుకు నోచుకుంది. ఆయనకు కేంద్రం పద్మశ్రీ పురస్కారం ప్రకటించి గౌరవించింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ పద్మశ్రీ మొగిలయ్యకు భారీ నజరానా ప్రకటించారు.

హైదరాబాదు నగరంలో ఇంటి స్థలంతో పాటు, ఇంటి నిర్మాణం కోసం రూ.1 కోటి నగదు కూడా ఇస్తున్నట్టు ప్రకటించారు. పద్మశ్రీకి ఎంపికైన నేపథ్యంలో మొగిలయ్య ఇవాళ ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మొగిలయ్యను సీఎం కేసీఆర్ శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


More Telugu News