ఏపీలో కొత్తగా 12,561 కరోనా కేసులు, 12 మరణాలు
- గత 24 గంటల్లో 40,635 కరోనా పరీక్షలు
- కర్నూలు జిల్లాలో 1,710 కొత్త కేసులు
- విశాఖ జిల్లాలో అత్యధికంగా ముగ్గురి మృతి
- రాష్ట్రంలో ఇంకా 1,13,300 మందికి చికిత్స
ఏపీలో కరోనా వ్యాప్తి తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 12 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా, 12 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా 40,635 కరోనా పరీక్షలు నిర్వహించగా... 12,561 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
అత్యధికంగా కర్నూలు జిల్లాలో 1,710 కొత్త కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 1,625 కేసులు, కడప జిల్లాలో 1,215 కేసులు, విశాఖ జిల్లాలో 1,211 కేసులు వెల్లడయ్యాయి.
విశాఖ జిల్లాలో ముగ్గురు మరణించగా, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. అనంతపురం, చిత్తూరు, విజయనగరం, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో కన్నుమూశారు. తాజా మరణాలతో కలిపి ఏపీలో కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 14,591కి పెరిగింది.
రాష్ట్రంలో ఇప్పటివరకు 22,48,608 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 21,20,717 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,13,300 మంది చికిత్స పొందుతున్నారు.