'కొంచమన్నా ఇంగిత జ్ఞానం లేదా?'.. అంటూ తనపై వచ్చిన 'పెళ్లి-విడాకుల' వార్తలపై సినీ నటి హిమజ ఆగ్రహం
- నేను పెళ్లి చేసుకుంటే గ్రాండ్‌గా చేసుకుంటాను
- నాపై తప్పుడు వార్తలు రాశారు
- సైబర్ క్రైమ్‌కి ఫిర్యాదు చేశాను
- అభిమానులూ ఫిర్యాదు చేయండి
'ఇటువంటి వార్తలు రాయడానికి కొంచమన్నా ఇంగిత జ్ఞానం లేదా?' అంటూ తనపై వచ్చిన పెళ్లి-విడాకుల వార్తలపై సినీ నటి, తెలుగు బిగ్ బాస్ ఫేమ్ హిమజ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన పెళ్లి జరిగిందని, విడాకులు కూడా ఇవ్వబోతుందని యూట్యూబ్, వెబ్‌సైట్లలో వార్తలు రావడంతో వాటిని ఖండిస్తూ ఆమె ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.
తాను షూటింగ్‌లో, తన పనిలో బిజీగా ఉన్నానని హిమజ చెప్పింది. తనకంటే ముందుగా తన మంచి గురించి ఆలోచించిన కొందరు సన్నిహితులు, శ్రేయోభిలాషులు కొందరు తన గురించి వచ్చిన కొన్ని వార్తల లింక్‌లు పంపారని చెప్పింది. తాను విడాకులు తీసుకుంటున్నట్లు అందులో ఉందని తెలిపింది.
కొన్ని ఆర్టికల్స్ లింకులు తాను చూశానని చెప్పింది. వాళ్లకి వారే లైవ్‌లో విడాకులు కూడా ఇచ్చేస్తున్నారని ఎద్దేవా చేసింది. ఒక వేళ తాను పెళ్లి చేసుకుంటే చాలా ఘనంగా చేసుకుంటానని చెప్పింది. తాను నాలుగైదేళ్ల తర్వాతే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అయితే, తనకు పెళ్లిళ్లు సెట్ కావంటూ వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ చేసుకుంటే మాత్రం చాలా గ్రాండ్‌గా చేసుకుంటానని చెప్పింది. మంచి సంబంధాలు ఉంటే తనకు చెప్పాలని చురకలంటించింది.
''అక్కా నీపై ఫేక్ న్యూస్ పెడుతున్నారు. రియాక్ట్ కా అక్కా అంటూ కొందరు కోరారు. అందుకే నేను స్పందిస్తున్నాను. సాధారణంగా వార్తల గురించి నేను పట్టించుకోను. అయితే, ఇంట్లో తల్లిదండ్రులు కాస్త సున్నితంగా ఉంటారు. వదంతుల వల్ల వారి మనసు బాధపడుతుంది. దయచేసి ఇలాంటి పనులు మానుకోండి. ఒకవేళ ఇలాంటి వార్తలు కనిపిస్తే దాన్ని రిపోర్ట్ చేయాలి.
నేను కూడా ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. నేను ఇల్లు కట్టుకుంటుంటే కొందరు ఓర్వలేకపోతున్నారు. అందుకే ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నట్లున్నారు. నా శ్రేయోభిలాషులను కూడా కొందరు ఇబ్బందులకు గురిచేస్తూ వార్తలు రాస్తున్నారు. నేను ఎప్పటికీ ఇబ్బంది పడను.
ఇంకొకరిని ఇబ్బంది పెట్టను. ఇలాంటి సమయంలో కొందరు నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. ఏ చానెల్‌లో ఇటువంటి వార్తలు వస్తాయో అటువంటి చానెళ్లపై ఫిర్యాదు చేయండి'' అని హిమజ కోరింది. యూట్యూబ్‌లోనే పెళ్లిళ్లు చేసేసి, వెబ్‌సైట్లలో ఆర్టికల్స్ రాసేసి, మళ్లీ వాళ్లే విడాకులు ఇచ్చేస్తున్నారని మండిపడింది.