'పుష్ప' హీరో అల్లు అర్జున్ కి శుభాకాంక్షలు తెలుపుతూ బాలీవుడ్ హీరోలపై క్రిటిక్ కేఆర్కే వివాదాస్పద వ్యాఖ్యలు
- హిందీలోకి డబ్ అయిన పుష్ప సినిమా
- దాదాపు 100 కోట్ల బిజినెస్ చేసిన వైనం
- బాలీవుడ్ స్టార్స్‌కి చెంపపెట్టులాంటిది
- బాలీవుడ్ స్టార్స్ రూ.25 కోట్ల కలెక్షన్లు సాధించడానికే కష్టపడుతున్నారన్న కేఆర్కే
కొత్త సినిమాలపై రివ్యూలు చేస్తూ, పాప్యులారిటీ తెచ్చుకున్న బాలీవుడ్ విశ్లేషకుడు కమాల్ ఆర్ ఖాన్ (కేఆర్‌కే) తాజాగా 'పుష్ప సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందీలోకి డబ్ అయిన పుష్ప సినిమా దాదాపు 100 కోట్ల బిజినెస్ చేసిందని, ఇటువంటి గొప్ప విజయాన్ని సాధించినందుకు అల్లు అర్జున్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. ఇది బాలీవుడ్ స్టార్స్‌కి చెంపపెట్టులాంటిదని ఆయన పేర్కొనడం గమనార్హం.
బాలీవుడ్ స్టార్స్ 25 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించడానికే కష్టపడుతున్నారని, అటువంటిది ఓ తెలుగు డబ్బింగ్ మూవీ రూ.100 కోట్లు సాధించిందని ఆయన కొనియాడారు. దీన్ని బట్టి చూస్తే బాలీవుడ్ అంటే జనాలకు నచ్చట్లేదని ఆయన అన్నారు. ఈ పుష్ప సినిమా డిస్ట్రిబ్యూటర్ మనీశ్‌కి బంగారు గనిలా మారిందని చెప్పారు. ఇక కేఆర్కే గతంలోనూ బాలీవుడ్ సినిమాల తీరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.