ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ 30 రోజులు ఉండాల్సిందే: ట్రాయ్

  • ప్రస్తుతం 28 రోజుల కాలపరిమితి 
  • సంవత్సరానికి 13 సార్లు రీచార్జ్
  • తాజా నిర్ణయం వల్ల తగ్గనున్న రీచార్జ్‌ల సంఖ్య
  • 60 రోజుల్లోపు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశం
మొబైల్ ఫోన్ వినియోగదారుల ప్రీపెయిడ్ ప్యాక్ వ్యాలిడిటీ విషయంలో టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ మరో సరికొత్త నిబంధన తీసుకొచ్చింది. గతంలో ప్రీపెయిడ్ ప్యాక్‌లు 30 రోజుల కాలపరిమితితో లభ్యమయ్యేవి. అయితే, ఆ తర్వాత వీటిని అన్ని టెలికం సంస్థలు 28 రోజులకు తగ్గించేశాయి. ఫలితంగా సంవత్సరానికి 13 సార్లు రీచార్జ్ చేసుకోవాల్సి వస్తోంది. వినియోగదారులకు ఇది భారంగా మారుతోంది.

ఈ నేపథ్యంలో ఇకపై ప్రతి సంస్థ 30 రోజుల కాలపరిమితితో ప్రీపెయిడ్ రీచార్జ్ ప్యాక్‌‌లను తీసుకురావాలని ఆదేశించింది. ఇందులో ప్లాన్ ఓచర్, ఒక స్పెషల్ టారిఫ్ ఓచర్, కాంబో వోచర్‌లు ఉండాలని స్పష్టం చేసింది. ప్రతి నెల ఒకే తేదీన వీటిని రీచార్జ్ చేసుకుంటే సరిపోయేలా ఉండాలని ఆదేశించింది. అంతేకాదు, రెండు నెలల్లోపు తమ ఆదేశాలను అమలు చేయాలని ఆదేశించింది.


More Telugu News