అరుదైన ఘనత సాధించిన 'శ్యామ్ సింగ రాయ్'

  • క్రితం నెలలో వచ్చిన 'శ్యామ్ సింగ రాయ్'
  • థియేటర్స్ నుంచి మంచి లాభాలు
  • ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
  • ఓటీటీ నుంచి అరుదైన రికార్డు సొంతం    
నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ రూపొందించిన 'శ్యామ్ సింగ రాయ్' క్రితం నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా, 'అఖండ' .. 'పుష్ప' జోరును తట్టుకుని నిలబడటం విశేషం. విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమైన ఈ సినిమా థియేటర్స్ నుంచి మంచి లాభాలను రాబట్టింది.

ఆ తరువాత ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేసింది. ఈ సినిమాను థియేటర్లలో చూడనివారు .. చూసినవారు కూడా నెట్ ఫ్లిక్స్ ద్వారా వీక్షించారు. ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నుంచి భారీస్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. గతవారం నెట్ ఫ్లిక్స్ లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూయర్ షిప్ తెచ్చుకున్న నాన్ తెలుగు చిత్రాల్లో టాప్ 3లో ఈ సినిమా నిలవడం విశేషం.

నెట్ ఫ్లిక్స్ లో క్రితం వారం ఇండియాలో అత్యధిక మంది చూసిన సినిమా ఇదే. నెట్ ఫ్లిక్స్ లో ఇంతవరకూ టాప్ 3 లో చోటు దక్కించుకున్న ఏకైక ఇండియన్ సినిమా కూడా ఇదేనని చెబుతున్నారు. ఈ సినిమా అటు థియేటర్స్ నుంచి .. ఇటు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నుంచి మంచి రెస్పాన్స్ ను తీసుకురావడం పట్ల నాని ఫుల్ హ్యాపీగా ఉన్నాడని అంటున్నారు..


More Telugu News