ఒమిక్రాన్ తగ్గినా.. ఈ సమస్యలు వేధిస్తున్నాయంటున్న వైద్య నిపుణులు
- జ్వరం, జలుబు, గొంతునొప్పి తగ్గుదల
- దగ్గు, ఒళ్లునొప్పులు, నీరసం తీవ్రం
- వారంలో దగ్గు తగ్గకుంటే వైద్యుడి వద్దకెళ్లాలంటున్న నిపుణులు
ఒమిక్రాన్ సోకినా దాని తీవ్రత తక్కువగానే ఉంటుండడం, ఆసుపత్రి పాలయ్యే ముప్పు కూడా తక్కువే ఉండడంతో జనాలు ఊపిరి పీల్చుకుంటున్నారు. సోకిన తర్వాత మూడు నాలుగు రోజుల్లోనే కోలుకుంటుండడంతో.. వారంలోనే ఆఫీసుల బాట కూడా పట్టేస్తున్నారు. అయితే, ఒమిక్రాన్ తగ్గిపోయినా కొన్ని లక్షణాలు మాత్రం అప్పటికీ తీవ్రంగానే వేధిస్తున్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఒమిక్రాన్ తగ్గాక జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలు తగ్గుముఖం పట్టినా.. దగ్గు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, నీరసం తీవ్రంగా ఉంటున్నాయని అంటున్నారు. దగ్గు తగ్గకపోతే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మామూలు మందులు వాడితే సరిపోతుందని సూచిస్తున్నారు. వారంలో తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. చాలా వరకు ఒమిక్రాన్ గొంతువరకే పరిమితమవుతోందని, ఆరంభంలోనే గుర్తిస్తే ఊపిరితిత్తుల దాకా వెళ్లకుండా అడ్డుకోవచ్చని అంటున్నారు.