ధోనీలాంటి వ్యక్తిని నేను ఎన్నడూ చూడలేదు: రవిశాస్త్రి
- ధోనీ చాలా ప్రశాంతంగా ఉంటాడు
- ఎన్నడూ కోపం తెచ్చుకోడు
- ఒక్కోసారి సచిన్ కు కోపం వస్తుంది
- ధోనీకి మాత్రం ఎప్పుడూ రాదు
- ఫోన్ కూడా అంతగా వాడడన్న శాస్త్రి
టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ లాంటి వ్యక్తిని తాను ఎన్నడూ చూడలేదంటూ మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ధోనీ చాలా ప్రశాంతంగా ఉంటాడని చెప్పారు. ధోనీ కోపంగా ఉండడాన్ని తాను ఎప్పుడూ చూడలేదని, డకౌటైనా, సెంచరీ కొట్టినా, ప్రపంచకప్ గెలిచినా, తొలి రౌండ్‌లోనే జట్టు వెనుదిరిగినా ధోనీ ఒకేలా ఉంటాడని చెప్పారు. సందర్భాలను బట్టి ఒక్కోసారి సచిన్ టెండూల్కర్‌కు కూడా కోపం వస్తుందని, ధోనీకి మాత్రం ఎప్పుడూ రాదని ఆయన తెలిపారు.
ధోనీ ఫోన్ వాడకూడదని అనుకుంటే వాడకుండా ఉండగలడని, గ్యాడ్జెట్ పక్కన పెట్టాలనుకుంటే పెట్టేస్తాడని చెప్పారు. తన వద్ద ఇప్పటికీ ధోనీ ఫోన్ నంబర్ లేదని, దీన్ని బట్టి అతడు ఎంత స్థితప్రజ్ఞతతో ఉంటాడో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ధోనీ కూడా తనను ఎన్నడూ ఫోన్ నంబర్ అడగలేదని, ధోనీ అసలు ఫోన్ దగ్గర పెట్టుకోడని తనకు తెలుసని చెప్పారు. అయినప్పటికీ, ధోనీతో మాట్లాడాలంటే కనుక ఎలా సంప్రదించవచ్చో తనకు తెలుసని అన్నారు. ధోనీ చాలా ప్రత్యేకమైన ఆటగాడని రవిశాస్త్రి చెప్పారు.