'ఖిలాడి' నుంచి 'ఫుల్ కిక్కు' సాంగ్ రిలీజ్!
- 'ఖిలాడి'గా రవితేజ
- సంగీత దర్శకుడిగా దేవిశ్రీ
- తాజాగా ఫోర్త్ సింగిల్ రిలీజ్
- ఫిబ్రవరి 11న సినిమా విడుదల
రవితేజ కథానాయకుడిగా రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' సినిమా రూపొందింది. వచ్చేనెల 11వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. సత్యనారాయణ కోనేరు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వదిలిన మూడు సింగిల్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కొంతసేపటికి నాల్గో సింగిల్ ను రిలీజ్ చేశారు.
'ఫుల్ కిక్కు' అంటూ ఈ పాట సాగుతోంది. రవితేజ - డింపుల్ హయతిపై ఈ పాటను షూట్ చేశారు. ఇది మాస్ బీట్ .. అందునా ఫాస్టు బీట్. రవితేజ ఎనర్జీ లెవెల్స్ కి తగినట్టుగానే ఉంది. శ్రీమణి సాహిత్యాన్ని అందించగా సాగర్ - మమత శర్మ ఆలపించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీని అందించారు.
రవితేజ సినిమా నుంచి .. అందునా దేవిశ్రీ నుంచి ఒక మాస్ నెంబర్ వస్తుందంటే, కొన్ని అంచనాలు ఉంటాయి. కానీ సంగీత సాహిత్యాల పరంగా గానీ, కొరియోగ్రఫీ పరంగా గాని కొత్తదనం కనిపించదు. కాస్త గందరగోళంగానే పాట వినిపిస్తోంది .. కనిపిస్తోంది. మరి ఈ పాటపై మాస్ మాట ఏమిటనేది చూడాలి.