ఏపీని అరాచకాంధ్రప్రదేశ్‌గా మార్చారు: సుజనా చౌదరి
- కేంద్రమంత్రి మురళీధరన్ పరామర్శను కూడా వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు
- శ్రీకాంత్‌రెడ్డిని 307 సెక్షన్ కింద ఎలా అరెస్టు చేస్తారు?
- గుడివాడ వెళ్తున్న నేతలను ఎందుకు అరెస్టు చేశారు? అంటూ ప్రశ్నించిన సుజనా
వైసీపీ నేతలపై బీజేపీ నేత సుజనా చౌదరి మండిపడ్డారు. కడప జిల్లాలో కేంద్ర మంత్రి మురళీధరన్ పర్యటించి, సెంట్రల్ జైల్లో ఉన్న బీజేపీ నేత శ్రీకాంత్‌రెడ్డిని పరామర్శించారు. అనంతరం ఆయన వైసీపీ నేతలపై మండిపడడంతో ఆయనపై రాష్ట్ర మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సుజనా చౌదరి స్పందిస్తూ... మురళీధరన్ పరామర్శను కూడా ఏపీ హోం మంత్రి సుచరిత వ్యతిరేకించడం దురదృష్టకరమని అన్నారు.
శ్రీకాంత్ రెడ్డిని 307 సెక్షన్ కింద ఎలా అరెస్టు చేస్తారని ఆయన ప్రశ్నించారు. గుడివాడ వెళ్తున్న తమ పార్టీ నేతలను ఎందుకు అరెస్టు చేశారని నిలదీశారు. ఏపీని వైసీపీ అరాచకాంధ్రప్రదేశ్‌గా మార్చిందని ఆయన మండిపడ్డారు. కాగా, కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన బీజేపీ నేత శ్రీకాంత్‌రెడ్డి ప్రస్తుతం కడప కేంద్ర కారాగారంలో రిమాండు ఖైదీగా ఉన్నారు.