టీడీపీ సర్పంచులు తింగరి వేషాలు వేస్తే ప్రతిపాదనలు ఆగిపోతాయి: ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు
- ఉపాధిహామీ పథకంపై పలాసలో సమీక్ష
- ఒకటి రెండు చోట్ల ఉన్న టీడీపీ సర్పంచులకు తన మాటగా చెప్పాలని సూచన
- ప్రతిపాదనలు ఎంపీడీవో కార్యాలయాలకే పరిమితమవుతాయన్న మంత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్థక, పాడి, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు టీడీపీ సర్పంచులను హెచ్చరించారు. ఉపాధిహామీ పథకంపై నిన్న శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్వహించిన నియోజకవర్గ సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ సర్పంచులు తింగరి వేషాలు వేయొద్దని హెచ్చరించారు. అలా చేస్తే ప్రతిపాదనలు ఎంపీడీవో కార్యాలయాల్లోనే ఉండిపోతాయని వార్నింగ్ ఇచ్చారు.
సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధిలో మనం ముందుండాలని, పంచాయతీల్లో ప్రతిపాదనలు పెట్టించాలని సూచించారు. ఒకటి రెండు చోట్ల ఉన్న టీడీపీ సర్పంచులకు మంత్రిగారు ఇలా చెప్పారని తెలియజేయాలని మంత్రి అప్పలరాజు సూచించారు.