వెస్టిండీస్ తో పరిమిత ఓవర్ల క్రికెట్ కు రోహిత్ శర్మ సిద్ధం

  • భారత్ లో పర్యటించనున్న వెస్టిండీస్
  • ఫిబ్రవరి 6 నుంచి టూర్
  • 3 వన్డేలు, 3 టీ20లు ఆడనున్న కరీబియన్లు
  • గాయం నుంచి కోలుకున్న రోహిత్ శర్మ
గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఫిట్ నెస్ సాధించాడు. ఫిబ్రవరిలో వెస్టిండీస్ తో సొంతగడ్డపై జరిగే వన్డే సిరీస్, టీ20 మ్యాచ్ లకు సిద్ధమయ్యాడు. ఫిబ్రవరి 6 నుంచి భారత్ లో వెస్టిండీస్ జట్టు 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్ లు ఆడనుంది. వన్డేలు, టీ20ల్లో టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ నియమితుడవడం తెలిసిందే.

కాగా వెస్టిండీస్ తో ఆడే భారత జట్టును సెలెక్టర్లు ఈ వారంలో ఎంపిక చేయనున్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో దారుణ ప్రదర్శన కనబర్చిన భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్ లకు ఈసారి జట్టులో చోటు లభించేది కష్టమేననిపిస్తోంది.

వెస్టిండీస్ పర్యటనపై బీసీసీఐ వర్గాలు స్పందించాయి. రోహిత్ శర్మ ఇప్పుడు పూర్తి ఫిట్ గా ఉన్నాడని, వెస్టిండీస్ తో సిరీస్ నాటికి ఇంకా ఫిట్ గా తయారవుతాడని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు. ముంబయిలో ఇప్పటికే సాధన చేస్తున్నాడని, త్వరలోనే బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్ నెస్ పరీక్షకు హాజరవుతాడని తెలిపారు.


More Telugu News