ఎన్నికల అఫిడవిట్ లో అవాస్తవాలు.. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుపై కేసు నమోదు చేసిన సీఐడీ

  • అశోక్ బాబుపై కేసును సీఐడీకి అప్పగించాలన్న లోకాయుక్త
  • గతేడాది ఆదేశాలు
  • పలు సెక్షన్ల కింద సీఐడీ కేసు
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు చిక్కుల్లో పడ్డారు. ఆయనపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. అశోక్ బాబుపై కేసును సీఐడీకి అప్పగించాలని గతేడాది లోకాయుక్త ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అశోక్ బాబుపై సెక్షన్ 477, 420, 465 కింద కేసు నమోదు చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నిక సమయంలో అఫిడవిట్ లో అవాస్తవాలు పేర్కొన్నారని సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఆయన బీకాం చదవకుండానే నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారని, సర్వీసు రికార్డు లేకుండానే తప్పుడు సమాచారం అందించారని సీఐడీ అధికారులు అభియోగం మోపారు. డిగ్రీ చదివినట్టు ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నట్టు తెలిపారు. రికార్డులను తారుమారు చేశారన్న అభియోగాలతో కేసు నమోదు చేశారు. అశోక్ బాబు గతంలో ఏసీటీవో ఉద్యోగం చేశారు.


More Telugu News