వినికిడి లోపం వుండే పిల్లల్లో వేగంగా పట్టేసే గుణం వుంటుందట!
- చూసిన దాన్ని వేగంగా గుర్తుంచుకోగలరు
- వారసత్వంగా వినికిడి సమస్య ఉంటే, ఇది ఇంకా ఎక్కువ
- హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ పరిశోధన
వినికిడి లోపం ఉన్న పిల్లలు.. దేన్ని అయినా చూసినా, తమ కళ్ల ముందు జరిగిన వాటిని వేగంగా గ్రహించి, గుర్తుంచుకునే శక్తిని కలిగి ఉంటారని మరోసారి నిరూపితమైంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్ సీయూ) ప్రొఫెసర్ రమేశ్, ఆయన ఆధ్వర్యంలోని విద్యార్థుల బృందం తాజాగా ఒక పరిశోధన నిర్వహించింది. వికినిడి లోపం కలిగిన పిల్లలపై దృష్టి సారించింది.
వినికిడి శక్తి సరిగా లేని పిల్లలు ఏది చూసినా ఇట్టే పట్టేస్తున్నారని వీరు గుర్తించారు. మరీ ముఖ్యంగా వినికిడి సమస్య ఉన్న తల్లిదండ్రులకు అదే సమస్యతో పుట్టిన పిల్లలలో ఇది ఇంకా ఎక్కువ ఉంటోందని తెలుసుకున్నారు. చుట్టూ పరిసరాల్లో జరిగే వాటిని వేగంగా తెలుసుకోవడం, చూసిన దృశ్యాలను వేగంగా అర్థం చేసుకుని, గుర్తుంచుకుంటున్నట్టు తెలిసింది. ఈ పరిశోధన ఫలితాలు న్యూరో సైకాలజియాలో ప్రచురితమయ్యాయి.