తాత, ముత్తాతలు పొగ తాగితే.. మనవరాళ్లపై ప్రభావం!

  • యుక్త వయసుకు ముందే పొగతాగితే..
  • వారి తర్వాతి తరాలపై ఆ ప్రభావం
  • ఫలితంగా అధిక బరువు సమస్య
  • బ్రిటన్ పరిశోధన ఒకటి వెల్లడి
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజమేనని చెబుతోంది జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం. ఎప్పుడో తాత, ముత్తాతలు పొగ తాగి ఉంటే, ఇప్పుడు వారి మనవరాళ్లలో శరీర ఫ్యాట్ ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు.

1990ల్లో జన్మించిన 30ఏళ్ల వయసు వారిపై బ్రిటన్ లో ఒక పరిశోధన జరిగింది. యుక్త వయసులోకి రాక ముందు బాలురు కొన్ని రసాయనాల ప్రభావానికి (పొగతాగడం సహా) గురైతే.. తదనంతరం వారి సంతానంపై ప్రభావం ఉంటున్నట్టు తెలిసింది. యక్త వయసుకు వచ్చిన తర్వాత పొగతాగడం, రసాయనాల ప్రభావానికి గురైన వారితో పోల్చి ఈ ఫలితాలను ప్రకటించింది.

‘‘ఈ పరిశోధన రెండు ఫలితాలను అందించింది. యుక్త వయసుకు రాకముందే కొన్నిరసాయనాల ప్రభావానికి గురి అయితే .. తర్వాతి తరాలపై ఆ ప్రభావం ఉంటుందని తెలిసింది. ఆడ పిల్లలు అధిక బరువు సమస్య బారిన పడటానికి ప్రస్తుతం తీసుకునే ఆహారం కాకుండా.. పూర్వీకుల జీవన శైలి ప్రభావం కారణమని అర్థమైంది’’ అంటూ ఈ అధ్యయానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ జాన్ గోల్డింగ్ తెలిపారు.


More Telugu News