హైదరాబాదులో నైట్ లైఫ్ కల్చర్ ను తీసుకొచ్చానని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అన్నారు.. ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తున్నారు: శ్రీకాంత్ రెడ్డి
- నైట్ లైఫ్ అనే బార్ లు, పబ్ లు, డిస్కోలు, కేసినోలే!
- నైట్ లైఫ్ ఉంటేనే మనకు పరిశ్రమలు వస్తాయన్నారు
- కేసినో పేరుతో ఇప్పుడు చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు
- చంద్రబాబు వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదన్న శ్రీకాంత్ రెడ్డి
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. కేసినో పేరుతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. సంక్రాంతి అయిపోయి 10 రోజులు గడిచి పోయిందని... అయినా ఇప్పటికీ చంద్రబాబు కేసినో, జూదం అని మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం జూదాన్ని ఎప్పుడూ ప్రోత్సహించలేదని చెప్పారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకు విపక్షం ప్రయత్నిస్తోందని అన్నారు. చంద్రబాబు సీనియారిటీతో దేశానికి, రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదని చెప్పారు.
హైదరాబాదులో నైట్ లైఫ్ కల్చర్ ను తాను తీసుకొచ్చానని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు చెప్పారని... బార్ లు, పబ్ లు, డిస్కోలు, కేసినోలే నైట్ లైఫ్ అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. నైట్ లైఫ్ ఉంటేనే మనకు పరిశ్రమలు వస్తాయని చెప్పిన చంద్రబాబు... ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు.
ఉద్యోగ సంఘాలు లేకుండా చేయాలని చంద్రబాబు భావించారని... ఉద్యోగ సంఘాల తోకలు కత్తిరిస్తానని బెదరించారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఈరోజు అదే ఉద్యోగ సంఘాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని ప్రభుత్వం కోరుతోందని చెప్పారు. కరోనా సమయంలో కూడా ఉద్యోగులు అడగకుండానే జగన్ 27 శాతం ఐఆర్ ఇచ్చారని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం కోసం జగన్ ఆలోచిస్తున్నారని చెప్పారు.