ఐఫోన్ యూజర్లకు వాట్సాప్ నుంచి పలు కొత్త ఫీచర్లు

  • వాయిస్ మెసేజ్ పాస్, రెజ్యూమ్ చేసుకోవచ్చు
  • మూడు కొత్త సదుపాయాలు
  • ఐవోఎస్ 15, తర్వాతి వెర్షన్లపై అందుబాటు
యాపిల్ ఐఫోన్ యూజర్లకు వాట్సాప్ పలు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. కొత్త వెర్షన్ 22.2.75 డౌన్ లోడ్ కు అందుబాటులో ఉంది.

వాయిస్ రికార్డింగ్

వాయిస్ రికార్డింగ్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఐఫోన్ యూజర్లు తమ ఫోన్లో వాట్సాప్ వాయిస్ మెస్సేజ్ లను రికార్డింగ్ చేస్తున్న సమయంలో పాస్, రెజ్యూమ్ చేసుకోవచ్చు. కొంతకాలంగా పరీక్షల్లో (బీటా వర్షన్) ఉన్న ఈ సదుపాయాన్ని యూజర్లు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఫోన్లో వాట్సాప్ వాయిస్ మెసేజ్ ను రికార్డ్ చేసుకున్న తర్వాత విని, పంపుకునే సౌలభ్యం వచ్చేసింది.

నియంత్రణలు

ఎంపిక చేసుకున్న యూజర్లే మీకు మెసేజ్ చేసేలా సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. ఐవోఎస్ 15లో ఫోకస్ మోడ్ ఉంటుంది. ఫోకస్ మోడ్ ను యాక్టివేట్ చేసుకున్నప్పటికీ, ఎంపిక చేసుకున్న వారు మీకు మెసేజ్ చేయగలరు. ఫోకస్ మోడ్ అంటే డీఎన్డీ మాదిరి. ఆ సమయంలో నోటిఫికేషన్లపై మీ నియంత్రణ ఉంటుంది.

నోటిఫికేషన్లలో యూజర్ల ఫొటోలు

ఇప్పటి వరకు వాట్సాప్ లో కొత్త నోటిఫికేషన్ అందుకున్నప్పుడు పంపిన వారి ప్రొఫైల్ ఫొటోతో పాటు పేరు కూడా తెలుసుకోవచ్చు. అలాగే, నోటిఫికేషన్ సమ్మరీ కూడా కనిపిస్తుంది.


More Telugu News