ఏపీలో 35 సంవత్సరాల తర్వాత సమ్మెకు సిద్ధమవుతున్న ఉద్యోగులు!
- అప్పట్లో ఎన్టీఆర్ హయాంలో 19 రోజులపాటు సమ్మె
- డిమాండ్లు తీర్చిన ఎన్టీఆర్ ప్రభుత్వం
- 1971లో కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో 56 రోజులపాటు సమ్మె
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఆందోళన చేస్తున్న ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్తే కనుక 35 ఏళ్ల తర్వాత ఏపీలో జరుగుతున్న తొలి సమ్మె ఇదే అవుతుంది. అప్పుడు కూడా ఇదే సమస్యపై ఉద్యోగులు ఆందోళనకు దిగారు.
1986లో ఉద్యోగుల పదవీ విరమణ వయసును అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం 58 ఏళ్ల నుంచి 55 ఏళ్లకు కుదించింది. అలాగే, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న ఉద్యోగుల కుటుంబాలకు ప్రోత్సాహకంగా అప్పటి వరకు అందుతున్న ఒక ఇంక్రిమెంట్, ఎర్న్‌డ్ లీవ్‌ను క్యాష్ చేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం రద్దు చేసింది.
దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన ఉద్యోగులు అక్టోబరు 1986లో 19 రోజులపాటు సమ్మెకు దిగారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం పీఆర్సీ అమలు చేయడంతోపాటు ఉద్యోగులకు తగ్గించిన పదవీ విరమణ వయసు సహా అన్ని ప్రయోజనాలను కల్పించేందుకు అంగీకరించింది. దీంతో ఉద్యోగులు సమ్మె విరమించారు. అలాగే, అంతకుముందు 1971లో కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో 56 రోజులపాటు ఉద్యోగులు సమ్మె చేశారు.