అర్ధరాత్రి వేళ బుద్ధా వెంకన్నను విడిచిపెట్టిన పోలీసులు
- మంత్రి కొడాలి నాని, డీజీపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు
- మూడు గంటల చర్చల అనంతరం అరెస్ట్
- రాత్రి 11.15 గంటలకు స్టేషన్ బెయిలుపై విడుదల
- తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్న వెంకన్న
ఏపీ మంత్రి కొడాలి నాని కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన క్యాసినో వ్యవహారంలో రూ. 250 కోట్లు చేతులు మారాయని, ఇందులో డీజీపీ వాటా ఎంత? అని విలేకరుల సమావేశంలో ప్రశ్నించినందుకు అరెస్ట్ అయిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న విడుదలయ్యారు. మంత్రి, డీజీపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ అనంతరం స్టేషన్ బెయిలుపై రాత్రి 11.15 గంటలకు విడుదల చేశారు.
నిన్న ఉదయం టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్‌మీరా, ఇతర నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో బుద్ధా వెంకన్న.. ప్రభుత్వంపైనా, పోలీసులపైనా నిప్పులు చెరిగారు. మంత్రి కొడాలి కన్వెన్షన్ సెంటర్‌లో క్యాసినో నిర్వహించినట్టు సాక్ష్యాధారాలున్నా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. డీజీపీ అంటే డైరెక్టర్ ఆఫ్ జగన్ పార్టీ అని ధ్వజమెత్తారు. కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టిందే చంద్రబాబు అని, అలాంటి వారికి టికెట్లు ఇవ్వడం చంద్రబాబు తప్పని అన్నారు. నాని గత చరిత్ర గురించి అందరికీ తెలుసన్నారు.
ఈ నేపథ్యంలో.. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గారావు ఫిర్యాదు మేరకు బుద్ధా వెంకన్నపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు మధ్యాహ్నం 2 గంటల సమయంలో వెంకన్నను అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందస్తు నోటీసు లేకుండా అరెస్ట్ ఎలా చేస్తారని ప్రశ్నిస్తూ టీడీపీ నేతలు అడ్డుకున్నారు.
దాదాపు మూడు గంటలపాటు పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య చర్చల అనంతరం భారీ బందోబస్తు మధ్య వెంకన్నను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాత్రి వరకు విచారించిన పోలీసులు అనంతరం విడిచిపెట్టారు. కాగా, పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. తాను అబద్ధాలు చెప్పలేదని, ఉన్న విషయాన్నే చెప్పానని పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు.