29 మంది బాలలకు ప్రధానమంత్రి బాల పురస్కార్... జాబితాలో తెలుగు బాలలు

  • ధైర్యసాహసాలు, ప్రతిభ ప్రదర్శించిన బాలలకు గుర్తింపు
  • అవార్డుకు ఎంపికైన వారితో ప్రధాని సమావేశం
  • డిజిటల్ సర్టిఫికెట్ల అందజేత
ధైర్యసాహసాలు, వివిధ రంగాల్లో ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన బాలలకు కేంద్రం అవార్డులు ప్రకటించింది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ కు 29 మంది బాలలు ఎంపికయ్యారు. వారిలో ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారున్నారు. ఏపీకి చెందిన గురుగు హిమప్రియ, తెలంగాణకు చెందిన తేలుకుంట విరాట్ చంద్ర కేంద్ర పురస్కారం అందుకోనున్నారు.

ప్రధానమంత్రి బాల పురస్కార్ కు ఎంపికైన వారికి నేడు డిజిటల్ సర్టిఫికెట్లు అందజేశారు. బాల పురస్కార్ అవార్డు గ్రహీతలతో ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ విధానంలో భేటీ అయ్యారు. వారిని అభినందించారు. బాల పురస్కార్ అవార్డులకు 5 నుంచి 18 ఏళ్ల లోపు వారిని పరిగణనలోకి తీసుకుంటారు. కాగా, గతేడాది ఈ అవార్డుకు ఎంపికైన వారికి కూడా ప్రధాని నేడు డిజిటల్ సర్టిఫికెట్లు అందజేశారు.


More Telugu News