ఉద్యోగుల జీతాలను తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఉంది: ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- పీఆర్సీ అంశంపై ఏపీ హైకోర్టులో పిటిషన్
- పీఆర్సీ వల్ల జీతం పెరిగిందా? తగ్గిందా? అని ప్రశ్నించిన హైకోర్టు
- ఉద్యోగుల గ్రాస్ శాలరీ పెరిగిందన్న ఏజీ
ఏపీలో పీఆర్సీ అంశం వేడి పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పీఆర్సీపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగుల జీతాలను తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది.
హెచ్ఆర్ఏ విభజన చట్టం ప్రకారం జరగలేదంటూ హైకోర్టు దృష్టికి పిటిషనర్ తెచ్చారు. అయితే ఈ ఆరోపణతో హైకోర్టు ఏకీభవించలేదు. పీఆర్సీ వల్ల జీతం పెరిగిందా? తగ్గిందా? అనేది చెప్పాలని కోర్టు అడిగింది. మీకు ఎంత జీతం తగ్గిందో చెప్పాలని... అంకెల్లో ఈ లెక్కలు అందజేయాలని వ్యాఖ్యానించింది.
అసలు పూర్తి డేటా లేకుండా కోర్టుకు ఎలా వస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. పర్సెంటేజీని ఛాలెంజ్ చేసే హక్కు మీకు లేదని తెలిపింది. ఈ పిటిషన్ కు చట్టబద్ధత లేదని వ్యాఖ్యానించింది. మరోవైపు ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ తన వాదలను వినిపిస్తూ... ఉద్యోగుల గ్రాస్ శాలరీ పెరిగిందని కోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించిన లెక్కలను అందించారు.