మరో వివాదంలో విరాట్ కోహ్లీ.. వీడియో ఇదిగో
- జాతీయ గీతాలాపన సమయంలో చూయింగ్ గమ్ నమిలిన వైనం
- తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న నెటిజన్లు
- కోహ్లీకి ఇగో మరింత పెరిగిందని ఆగ్రహం
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ పదే పదే వార్తల్లోకి ఎక్కుతున్నాడు. కెప్టెన్సీ నుంచి ఆయన తప్పుకున్న వివాదంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగానే ఇప్పుడు ఆయనను మరో వివాదం చుట్టుముట్టింది. దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి వన్డే మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరుజట్ల ఆటగాళ్లు మైదానంలోకి వచ్చి జాతీయ గీతాలాపన చేశారు.
అయితే, ఆ సమయంలో భారత ఆటగాళ్లు జాతీయ గీతం ఆలపిస్తుండగా కోహ్లీ మాత్రం చూయింగ్ గమ్ నములుతూ గీతాలాపన చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. జాతీయ గీతాలాపన సమయంలో ఆయన తీరు బాగోలేదని, చాలా పొగరుగా వ్యవహరిస్తున్నాడని నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
కోహ్లీ జాతీయ గీతాన్ని అవమానించాడని విమర్శిస్తూ, చర్యలు తీసుకోవాలని అంటున్నారు. కాగా, కోహ్లీ ఇగోను పక్కనపెట్టాలంటూ ఇటీవలే కపిల్ దేవ్‌తో పాటు పలువురు ప్రముఖులు సూచించిన విషయం తెలిసిందే.
ఇదిలావుంచితే, దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా పూర్తిగా విఫలం కావడం పట్ల కూడా నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆటపై దృష్టి పెట్టాలని క్రికెటర్లకు సూచిస్తున్నారు.