వైష్ణవ్ తేజ్ హీరోగా 'రంగ రంగ వైభవంగా' .. టీజర్ రిలీజ్

  •  వైష్ణవ్ తేజ్ హీరోగా మరో లవ్ స్టోరీ 
  • కథానాయికగా కేతిక శర్మ 
  • దర్శకుడిగా గిరీశాయ 
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ
'ఉప్పెన' సినిమాతో తొలి ప్రయత్నంలోనే భారీ హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్, ఆ తరువాత 'కొండ పొలం' సినిమాతోను మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఆయన మూడో సినిమా ముస్తాబవుతోంది. ఈ సినిమాకి 'రంగ రంగ వైభవంగా' అనే టైటిల్ ను ఖరారు చేశారు. కొంతసేపటి క్రితమే టైటిల్ టీజర్ ను రిలీజ్ చేశారు.

"ఒక అమ్మాయి ట్రీట్ ఇవ్వాలనుకుంటే తనతో పాటు ఏమీ తీసుకురావలసిన అవసరం లేదు తెలుసా?" అంటూ బాయ్ ఫ్రెండ్ కి హీరోయిన్ బట్టర్ ఫ్లై కిస్ ఇవ్వడంపై టైటిల్ లాంచ్ టీజర్ ను కట్ చేశారు. లిప్ లాక్ తో టీజర్ ని స్టార్ట్ చేయడం వలన, ఈ సినిమా యూత్ కి ఒక రేంజ్  లో కనెక్ట్ అవుతుందని చెప్పచ్చు.

బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో, వైష్ణవ్ తేజ్ జోడీగా కేతిక శర్మ కనిపించనుంది. 'రొమాంటిక్' .. 'లక్ష్య' తరువాత ఆమె చేస్తున్న సినిమా ఇది. టైటిల్ తో .. రొమాంటిక్ సీన్ తో మంచి మార్కులు కొట్టేసిన ఈ సినిమా, ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


More Telugu News