టెస్ట్ లకు దొరక్కుండా విస్తరిస్తున్న ‘దొంగ ఒమిక్రాన్’.. కేసుల పెరుగుదలపై ఆందోళన
- ప్రస్తుతం ఎక్కువగా చూస్తున్నది బీఏ.1 వేరియంట్
- తాజాగా బీఏ.2 రకం వ్యాప్తి
- ఇప్పటికే 40 దేశాలకు విస్తరణ
- డెన్మార్క్ లో సగం కేసులు ఇవే
- మ్యూటేషన్ లో మార్పులు
కరోనా ఒమిక్రాన్ వేరియంట్ లోనే మరొక ఉపరకం (సబ్ వేరియంట్) అయిన బీఏ.2 ఆర్టీపీసీఆర్ టెస్ట్ లకు దొరక్కుండా విస్తరిస్తుండడంపై బ్రిటన్ ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే దీన్ని రహస్య (దొంగ) ఒమిక్రాన్ గా పిలుస్తున్నారు. ఇది ఇప్పటికే 40 దేశాలకు విస్తరించినట్టు బ్రిటన్ తెలిపింది. దీంతో యూరోప్ వ్యాప్తంగా తీవ్రత చూపించొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్ కు సంబంధించి బీఏ.1, బీఏ.2, బీఏ.3 రకాలు ఉన్నట్టు ప్రకటించింది. ఇందులో బీఏ.1 ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు వెళ్లి కేసుల పెరుగుదలకు కారణమవుతోంది. మన దేశంలోనూ దీని తీవ్రత చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు బీఏ.2 కూడా వేగంగా విస్తరిస్తోంది. డెన్మార్క్ జనవరి 20 నాటికి బీఏ.2 కేసులు దేశంలో సగం ఉంటాయని ప్రకటించింది.
బ్రిటన్, డెన్మార్క్ తోపాటు, స్వీడన్, నార్వే, భారత్ లోనూ బీఏ.2 విస్తరిస్తోంది. బీఏ.1 కేసులను బీఏ.2 కేసులు అధిగమించొచ్చని సైంటిస్టులు ఇప్పటికే హెచ్చరించారు. బీఏ.1తో పోలిస్తే బీఏ.2లో 28 వినూత్నమైన మ్యూటేషన్లు కనిపించాయి. పరిశోధకులు చెబుతున్న దాని ప్రకారం.. బీఏ.1 మ్యూటేషన్ లో ఎస్ లేదా స్పైక్ జీన్ తొలగిపోవడం అన్నది ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో గుర్తించొచ్చు. కానీ, బీఏ.2 మ్యూటేషన్ భిన్నంగా ఉంది. దీంతో ఇది ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో కనిపించడం లేదు.