'ఖిలాడి' సాంగ్ కి ముహూర్తం ఖరారు!

  • రవితేజ తాజా చిత్రంగా 'ఖిలాడి'
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ
  • కథానాయికలుగా మీనాక్షి, డింపుల్
  • వచ్చేనెల 11వ తేదీన విడుదల  
క్రితం ఏడాది 'క్రాక్' సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న రవితేజ, ఈ ఏడాది ఆరంభంలోనూ అదే మ్యాజిక్ ను రిపీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'ఖిలాడి' వచ్చేనెల 11వ తేదీన భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.  

ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇంతవరకూ వదిలిన సింగిల్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో 'ఫుల్ కిక్కు' అంటూ సాగే లిరికల్ వీడియోను ఈ నెల 26వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు కొన్ని రోజుల క్రితం చెప్పారు. ఆ రోజున ఉదయం 10:08 నిమిషాలకు ఈ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు.

ఈ పాటకి శ్రీమణి సాహిత్యాన్ని అందించగా, సాగర్ ఆలపించాడు. చూస్తుంటే రవితేజ ఎనర్జీకి తగినట్టుగా ఈ పాట మంచి జోరుగా సాగనున్నట్టు అర్థమవుతోంది. సత్యనారాయణ కోనేరు నిర్మించిన ఈ సినిమాలో అర్జున్ ప్రతినాయకుడి పాత్రను పోషించాడు. ముఖ్యమైన పాత్రల్లో వెన్నెల కిశోర్ .. మురళీశర్మ .. అనసూయ కనిపించనున్నారు.


More Telugu News