నేడు 36 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
- ఇది వరకు 38 సర్వీసులను రద్దు చేసిన రైల్వే
- నేటితో గడువు ముగియనున్న నేపథ్యంలో మరోమారు ప్రకటన
- అందుబాటులో రెండు రైళ్లు మాత్రమే
హైదరాబాద్- లింగంపల్లి, ఫలక్‌నుమా-లింగంపల్లి, సికింద్రాబాద్-లింగంపల్లి మధ్య నడుస్తున్న ఎంఎంటీఎస్ రైళ్లలో 36 సర్వీసులను నేడు రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 23 వరకు 38 సర్వీసులను ఇది వరకే రద్దు చేసిన రైల్వే.. నేటితో ఆ గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేసింది.
రద్దు చేసిన రైళ్లలో రెండింటిని మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక రద్దయిన సర్వీసుల్లో హైదరాబాద్-లింగంపల్లి మధ్య నడుస్తున్న 18 రైళ్లు, ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య నడుస్తున్న 16 రైళ్లు, సికింద్రాబాద్-లింగంపల్లి మధ్య నడుస్తున్న రెండు రైళ్లు ఉన్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు.