బోరిస్ జాన్సన్ ప్రభుత్వంపై బ్రిటన్ మాజీ మంత్రి నస్రత్ ఘనీ సంచలన ఆరోపణలు
- ఫిబ్రవరి 2020లో మంత్రి పదవి కోల్పోయిన నస్రత్ ఘనీ
- పార్టీకి విధేయురాలిగా ఉండడం లేదని చెప్పారు
- వారు నా నుంచి అధిక విధేయత కోరుకుంటున్నట్టు అర్థమైంది
- ఆ రోజుతో పార్టీపై నమ్మకం పోయిందన్న నస్రత్
బ్రిటన్‌లోని బోరిస్ జాన్సన్ ప్రభుత్వంపై సొంతం పార్టీ ఎంపీ, మాజీ మంత్రి నస్రత్ ఘనీ సంచలన ఆరోపణలు చేశారు. ముస్లింను కావడంతోనే తనను మంత్రి పదవి నుంచి తప్పించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పదవి నుంచి తనను ఎందుకు తొలగించారని పార్టీ విప్‌లను అడిగానని, వారిచ్చిన సమాధానం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు.
ముస్లిం మహిళా మంత్రిగా తనకున్న హోదా కారణంగా సహచర ఎంపీలకు ఇబ్బందిగా మారుతోందని, అలాగే ఇస్లామోఫోబియా ఆరోపణల నుంచి పార్టీని రక్షించేలా పనిచేయడం లేదని చెప్పారని గుర్తు చేసుకున్నారు. పార్టీకి విధేయురాలిగా ఉండడం లేదని చెప్పారని, తాను పాటించే మత విశ్వాసాల కారణంగా వారు తన నుంచి అధిక విధేయత కోరుకుంటున్నారని అర్థమైందని, పార్టీపై తనకున్న నమ్మకం ఆ రోజుతో పోయిందని నస్రత్ అన్నారు.
అయితే, ఆమె వ్యాఖ్యలను కన్జర్వేటివ్ పార్టీ చీఫ్ విప్ మార్క్ స్పెన్సర్స్ ఖండించారు. నస్రత్ తనను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశారని అన్నారు. నిజానికి తానెప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తమ పార్టీలో మత, జాత్యహంకారాలకు చోటు లేదన్నారు.
ఎంపీ నస్రత్ ఆరోపణలపై బ్రిటన్ న్యాయశాఖ కార్యదర్శి రాబ్ స్పందించారు. నస్రత్ వ్యాఖ్యలు తీవ్రమైనవని, ఆమె కనుక అధికారికంగా ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేపడతామని చెప్పారు. కాగా, కన్జర్వేటివ్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన నస్రత్ ఘనీ 2018లో థెరెసా మే ప్రభుత్వంలో రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. అయితే, ఫిబ్రవరి 2020లో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో బోరిస్ జాన్సన్ ప్రధాని అయ్యారు. నస్రత్ మంత్రి పదవి కోల్పోయారు.