నేతాజీ సుభాష్ చంద్రబోస్ హాలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ
- నేతాజీ 125వ జయంతి
- దేశవ్యాప్తంగా వేడుకలు
- ఇండియా గేట్ వద్ద హాలోగ్రామ్ విగ్రహం
భరతమాత ముద్దుబిడ్డ, స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద సుభాష్ చంద్రబోస్ హాలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ఇది చారిత్రక స్థలం అని, ఇక్కడ నేతాజీ విగ్రహ ప్రతిష్ఠాపన ఒక చారిత్రక సందర్భం అని అభివర్ణించారు. బ్రిటీష్ పాలకుల ముందు తలదించుకునేందుకు బోస్ అంగీకరించలేదని, ఆయన విగ్రహం భావి తరాలకు ప్రజాస్వామ్య స్ఫూర్తిని అందిస్తుందని పేర్కొన్నారు. "చేయగలం", "చేస్తాం" అంటూ బోస్ అందించిన ప్రేరణను అందరూ అందిపుచ్చుకోవాలని మోదీ పిలుపునిచ్చారు.