ఏపీలో కరోనా కేసులు ఇంకాస్త పైపైకి..!
- గత 24 గంటల్లో 46,650 కరోనా పరీక్షలు
- 14,440 కొత్త కేసులు నమోదు
- విశాఖ జిల్లాలో రెండు వేలకు పైగా కొత్త కేసులు
- రాష్ట్రంలో నలుగురి మృతి
- ఇంకా 83,610 మందికి చికిత్స
ఏపీలో కరోనా రోజువారీ కేసుల సంఖ్యలో ఇంకాస్త పెరుగుదల కనిపించింది. గడచిన 24 గంటల్లో 46,650 శాంపిల్స్ పరీక్షించగా 14,440 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. విశాఖ జిల్లాలో రెండు వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా విశాఖ జిల్లాలో 2,258 కేసులు వెల్లడి కాగా, అనంతపురం జిల్లాలో 1,534 కేసులు, గుంటూరు జిల్లాలో 1,458 కేసులు, ప్రకాశం జిల్లాలో 1,399 కేసులు, కర్నూలు జిల్లాలో 1,238 కేసులు గుర్తించారు.
అదే సమయంలో 3,969 మంది ఆరోగ్యవంతులు కాగా, నలుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 21,80,634 మందికి కరోనా సోకగా, వారిలో 20,82,482 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 83,610 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,542కి పెరిగింది.