దేశంలోనే పొడవైన వ్యక్తి ధర్మేంద్ర ప్రతాప్ సింగ్.. రాజకీయ నేతగా అవతారం
- సమాజ్ వాదీ పార్టీలో చేరిక
- ఆయన ఎత్తు 8 అడుగుల ఒక అంగుళం
- ప్రపంచ రికార్డు కంటే 11 సెంటీమీటర్లు తక్కువ
దేశంలోనే అత్యంత పొడవైన వ్యక్తిగా పేర్కొంటున్న ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ సమాజ్ వాదీ పార్టీలో చేరారు. తద్వారా రాజకీయ నేతగా అవతారం ఎత్తారు. యూపీకి చెందిన ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ ఎత్తు 8 అడుగుల ఒక అంగుళం. 2.4 మీటర్లు. ప్రపంచ రికార్డు కంటే 11 సెంటీమీటర్లు తక్కువ.
సమాజ్ వాదీ పార్టీ విధానాలు, అఖిలేశ్ యాదవ్ నాయకత్వం నచ్చి ప్రతాప్ సింగ్ ఎస్పీలో చేరినట్టు ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి ప్రకటించారు. ఆయన రాకతో పార్టీ మరింత బలం పుంజుకుంటుందన్నారు.
చాలా పొడవు ఉండడంతో తాను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నట్టు ఈ సందర్భంగా ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. పొడవు ఎక్కువ ఉండడం వల్ల ఎవరూ ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని, వివాహం చేసుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదని చెప్పారు. అయితే, ఈ పొడవు కారణంగా తాను సెలబ్రిటీ అయిపోయినట్టు.. ప్రజలు తనతో ఫొటో తీసుకునేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తారని వెల్లడించారు.