రూ.20 కోట్లు వసూలు చేసి అర్ధరాత్రి ఇల్లు ఖాళీ చేసి పారిపోబోయిన మహిళ
- అనంతపురంలో ఘటన
- చిట్టీల పేరిట డబ్బులు వసూలు
- పారిపోతుండగా పట్టుకున్న స్థానికులు
- పోలీసులకు అప్పగింత
చిట్టీల పేరుతో రూ.20 కోట్లు వసూలు చేసిన ఓ మహిళ గత అర్ధరాత్రి ఇల్లు ఖాళీ చేసి పారిపోబోయింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు ఆమెను పట్టుకున్నారు. అనంతపురం జిల్లా విద్యుత్‌నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. జయలక్ష్మి అనే మహిళ చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేసేది. అలాగే, బ్యూటీ పార్లర్ కూడా నడుపుతుండేది. ఆమెను నమ్మిన స్థానికులు పెద్ద ఎత్తున చిట్టీలు వేశారు.
స్థానిక ఎస్సై కూడా ఆమెకు వత్తాసు పలికేవాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. దాదాపు 20 కోట్ల రూపాయలు వసూలు చేసిన జయలక్ష్మి ఇక అక్కడి నుంచి మరో ప్రాంతానికి పారిపోయి ఆ డబ్బుతో హాయిగా గడపవచ్చని భావించింది. ప్లాన్ ప్రకారం గత అర్ధరాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళుతుండగా బాధిత మహిళలు ఆమెను వెంబడించి పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. అయితే, బాధిత మహిళలపైనే ఎస్ఐ రాఘవరెడ్డి మండిపడడం గమనార్హం. ఎందుకు చిట్టీలు వేశారంటూ ఆయన ప్రశ్నించారు. దీంతో ఆయనపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.