ఎన్డీఆర్ఎఫ్ ట్విట్టర్ ఖాతా హ్యాక్.. పలు మెసేజ్లు పోస్ట్ చేసిన హ్యాకర్లు
- తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు
- మళ్లీ పునరుద్ధరించామని ప్రకటన
- ఈ నెల 19నే ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) ట్విట్టర్ ఖాతా హ్యాక్ కావడం కలకలం రేపింది. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు ఆ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేసి, మళ్లీ పునరుద్ధరించారు. ఆ ఖాతాలో కొందరు పలు మెసేజ్ లు పోస్ట్ చేశారని, అయితే, పబ్లిష్ అయిన మెసేజ్ లు లోడ్ కాలేదని సంబంధిత అధికారులు మీడియాకు చెప్పారు.
వాటిల్లో డిస్‌ప్లే ఫొటో మాత్రమే కనిపించిందని వివరించారు. ఆ ఖాతాను మళ్లీ పునరుద్ధరించామని చెప్పారు. కాగా, దేశంలో ప్రకృతి విపత్తులు సంభవిస్తే సాయం చేయడం కోసం ఎన్డీఆర్ఎఫ్ పనిచేస్తోంది. ఈ నెల 19నే ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు.