భార‌త్‌లో సామాజిక వ్యాప్తి స్థాయికి చేరుకున్న ఒమిక్రాన్: ఇన్సాకాగ్

  • ఢిల్లీ, ముంబైలో అధికం
  • చాలా మందిలో ల‌క్ష‌ణాలు క‌న‌ప‌డ‌డం లేదు
  • కొంద‌రిలో స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు
  • ఒమిక్రాన్‌ను నిర్ల‌క్ష్యంగా చూడ‌కూడ‌దు
భార‌త్‌లో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకి పెరిగిపోతోన్న విష‌యం తెలిసిందే. దీనిపై పరిశోధ‌న జ‌రిపిన ఇన్సాకాగ్.. దేశంలో ఒమిక్రాన్ కేసులు సామాజిక వ్యాప్తి స్థాయికి చేరుకున్నాయ‌ని తెలిపింది. ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ ఢిల్లీ, ముంబైలో అధికంగా ఉంద‌ని చెప్పింది.

ఈ వేరియంట్ విదేశీ ప్ర‌యాణికుల నుంచి వ్యాపించే దాని కంటే దేశీయ వ్యాప్తే అధికంగా ఉంద‌ని తెలిపింది. వ్యాక్సిన్ తీసుకున్న ప్ర‌యాణికుల్లో ఈ వేరియంట్‌ను తొలుత గుర్తించార‌ని పేర్కొంది. ఒమిక్రాన్ సోకిన వారిలో చాలా మందికి ల‌క్ష‌ణాలు క‌న‌ప‌డ‌డం లేద‌ని తెలిపింది. కొంద‌రిలో స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు క‌న‌ప‌డుతున్న‌ట్లు పేర్కొంది.

ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్ర‌త అధికంగా ఉన్నా ఆసుప‌త్రుల్లో చేరాల్సిన అవ‌స‌రం త‌క్కువేన‌ని చెప్పింది. అయిన‌ప్ప‌టికీ ఒమిక్రాన్‌ను నిర్ల‌క్ష్యం చేస్తూ చూడ‌కూడ‌ద‌ని, అన్ని జాగ్ర‌త్త‌లూ పాటించాల‌ని ఇన్సాకాగ్ సూచించింది.


More Telugu News