ఫైల్స్ తేలేదని ఆగ్రహం.. డిప్యూటీ కలెక్టర్, అధికారిని సమీక్ష హాలులోనే కొట్టిన కేంద్రమంత్రి!
- ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఘటన
- తన నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై సహాయమంత్రి బిశ్వేశ్వర్ సమీక్ష
- సంబంధిత ఫైల్స్ తీసుకురాకపోవడంతో ఆగ్రహం
- కుర్చీతో దాడి
- ఖండించిన కేంద్రమంత్రి
సమీక్ష సమావేశానికి సంబంధిత ఫైల్స్ తీసుకురాకుండా చేతులు ఊపుకుంటూ రావడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి అధికారులను కుర్చీతో కొట్టారు. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో జరిగిందీ ఘటన. జిల్లా డిప్యూటీ కలెక్టర్ అశ్వినీకుమార్ మాలిక్ తెలిపిన వివరాల ప్రకారం.. కేంద్ర జలశక్తి, గిరిజన వ్యవహారాల శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు తన లోక్‌సభ నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై బారిపద పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశానికి అధికారులు ఫైల్స్ తీసుకురాకుండా ఉత్తచేతులతో రావడం మంత్రికి ఆగ్రహం తెప్పించింది. డిప్యూటీ కలెక్టర్ అశ్వినీ కుమార్, జిల్లా ప్రణాళిక, పర్యవేక్షణ యూనిట్ డైరెక్టర్ దేబాశీష్ మహాపాత్రపై మండిపడిన మంత్రి సమీక్ష నిర్వహిస్తున్న గది తలుపులు మూసేసి తమపై భౌతిక దాడికి దిగారని ఆరోపించారు.
ఈ దాడిలో తన చేయి విరిగిపోయిందని మహాపాత్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయని డిప్యూటీ కలెక్టర్ తెలిపారు. వారి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, దాడి వార్తలను మంత్రి బిశ్వేశ్వర్ ఖండించారు.