ఇక రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు... తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
- ఇప్పటికే వాసాలమర్రి, హుజూరాబాద్ లో అమలు
- మంత్రి కొప్పుల ఈశ్వర్, సీఎస్ సమీక్ష
- అమలు విధివిధానాలపై చర్చ
- నియోజకవర్గానికి 100 మంది లబ్దిదారుల ఎంపిక
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పథకం దళితబంధు. ఇప్పటికే వాసాలమర్రి, హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. తాజాగా ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఇవాళ మంత్రి కొప్పుల ఈశ్వర్, సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. అమలు విధివిధానాలపై చర్చించారు.
దళితబంధు పథకం కోసం ప్రతి నియోజకవర్గంలో 100 మంది లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు. ఎమ్మెల్యేల సలహాతో జాబితా రూపొందిస్తారు. లబ్దిదారులకు బ్యాంకు లింకుతో సంబంధం లేకుండా రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. లబ్దిదారుడు కోరుకున్న యూనిట్ ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించారు.