సీఎం జగన్ పై స్వామి పరిపూర్ణానంద ధ్వజం
- ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం
- కడప జిల్లాలో టిప్పు విగ్రహ ఏర్పాటుకు యత్నించారని వెల్లడి
- జైళ్లలో వేయడం సాధారణంగా మారిందని వ్యాఖ్యలు
- జగన్ ను దింపి తీరతామని ప్రతిన
శ్రీపీఠం వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్వామి పరిపూర్ణానంద ఏపీ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. కేరళలో గిరిజనులను పొట్టనబెట్టుకున్న టిప్పుసుల్తాన్ కు కడప జిల్లాలో విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ప్రయత్నించారని మండిపడ్డారు. దీన్ని బట్టే జగన్ ఆలోచనలు ఎలా ఉంటాయో తేటతెల్లమవుతోందని అన్నారు. అటు, 98 శాతం హిందువులు నివసించే ప్రాంతంలో మసీదు నిర్మాణానికి సన్నాహాలు చేశారని ఆరోపించారు.
జగన్ ముఖ్యమంత్రిగా వచ్చినప్పటినుంచి ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని పరిపూర్ణానంద విమర్శించారు. సీఎం జగన్ కు జైళ్లలో వేయడం సాధారణ విషయంలా మారిందని, అందరినీ కారాగారాల్లో వేసేందుకు ప్రయత్నించినా హిందువులు సిద్ధంగా ఉండాలన్నారు. జగన్ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దింపడం ఖాయమని స్పష్టం చేశారు.