దేవెగౌడకు కరోనా.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన యడియూరప్ప

  • నిన్న కరోనా టెస్టు చేయించుకున్న దేవెగౌడ
  • అసింప్టొమేటిక్ లక్షణాలతో ఆయనకు పాజిటివ్ నిర్ధారణ
  • కన్నడలో ట్వీట్ చేసిన యడియూరప్ప
భారత మాజీ ప్రధాని దేవెగౌడ కరోనా బారిన పడ్డారు. ఆయనలో కోవిడ్ లక్షణాలు లేవని ఆయన కార్యాలయం ప్రకటించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పింది. నిన్న సాయంత్రం దేవెగౌడ కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని ఈ ఉదయం రిపోర్టు వచ్చింది. మరోవైపు దేవెగౌడకు కరోనా సోకిందనే విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా ధ్రువీకరించారు. దేవెగౌడ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన కన్నడలో ట్వీట్ చేశారు.


More Telugu News