జస్ట్.. క్యూలో నిలుచున్నందుకు రోజుకు రూ.16 వేలు!

జస్ట్.. క్యూలో నిలుచున్నందుకు రోజుకు రూ.16 వేలు!
  • బ్రిటన్ యువకుడి విభిన్నమైన వృత్తి
  • గంటకు రూ.2,000
  • రోజులో ఎనిమిది గంటల పాటు 
  • ధనవంతులకు టికెట్లు సంపాదించి పెట్టే పని
సామాన్యులకు ‘క్యూ’ కష్టాలు కొత్త కాదు. రేషన్ షాపుల నుంచి, సినిమా హాళ్ల వరకు ఎన్నో సందర్భాల్లో గంటల తరబడి వేచి చూసిన అనుభవాలు ఉంటాయి. అంతెందుకు మోదీ సర్కారు పెద్ద నోట్లను రద్దు చేసిన సందర్భంలోనూ ఏటీఎంల దగ్గర క్యూ కట్టి రోజంతా వేచి చూసిన అనుభవాలు కూడా ఉన్నాయి.

ఇదంతా ఎందుకంటే క్యూలైన్లలో వేచి ఉండడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. అందరికీ అంత ఓపిక, సహనం కూడా ఉండవు. దీంతో క్యూ లైన్లలో వేచి ఉండి, కావాల్సిన పని చేయడాన్ని బ్రిటన్ కు చెందిన ఫ్రెడ్డీ బెకిట్ (31) ఉపాధిగా మలుచుకున్నాడు. దీనిద్వారా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, కొందరు వైద్యుల కంటే కూడా ఎక్కువే సంపాదిస్తున్నాడు.

బ్రిటన్ లో క్యూలలో నిల్చోవడం పెద్ద ప్రయాస. ఇదే ఫ్రెడ్డీకి మంచి ఆదాయ మార్గంగా మారింది. అక్కడ ఎంతో పేరుండే ఈవెంట్లలో పాల్గొనే టికెట్ల కోసం డిమాండ్ గట్టిగానే ఉంటుంది. ముందే వచ్చి క్యూలైన్లలో గంటల పాటు వేచి చూస్తే కానీ టికెట్ లభించదు. క్యూలైన్లలో వేచి చూసే ఓపిక లేని వారి తరఫున ఫ్రెడ్డీ ఆ పని చేసి పెడతాడు.

ఈ పని కోసం గంటకు 20 పౌండ్లు తీసుకుంటాడు. మన కరెన్సీలో సమారు రూ.2,000కు పైమాటే. డిమాండ్ ను బట్టి రోజులో 8 గంటల పాటు ఈ పని చేస్తుంటాడు. తద్వారా కాళ్లనిండా పని ఉన్నరోజున అతడికి రూ.16,000కు పైనే ఆదాయం వస్తుంది. క్యూలలో నిల్చోవడం అన్నది ఒక కళని, అది తనకు చిన్నప్పటి నుంచే అబ్బిందని ఫ్రెడ్డీ హ్యాపీగా చెబుతాడు. 


More Telugu News