తెలంగాణకు మూడు రోజుల వర్ష సూచన
- ఆదివారం నుంచి మంగళవారం వరకు వర్షాలు
- కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం
- ఇప్పటికే అకాల వర్షాలతో భారీగా నష్టపోయిన రైతులు
తెలంగాణలో చలి తీవ్రత తగ్గుతోంది. ఉష్ణోగ్రతలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు మూడు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆదివారం నుంచి మంగళవారం వరకు కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రైతులు భారీగా నష్టపోయారు. ఇప్పుడు మరోసారి అకాల వర్షాలు కురువనుండటంతో రైతులు మరింత నష్టపోయే అవకాశం ఉంది.