నటి కంగన పోస్టులు చేయకుండా అడ్డుకోలేం.. మీరు వాటిని పట్టించుకోకుంటే సరి: సుప్రీంకోర్టు
- కంగన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన న్యాయవాది
- క్రిమినల్ చట్టాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచన
- ఎఫ్ఐఆర్‌లు అన్నింటినీ ముంబై పోలీస్ స్టేషన్‌కు మార్చాలన్న అభ్యర్థనకూ కోర్టు తిరస్కరణ
బాలీవుడ్ నటి కంగన రనౌత్ సామాజిక మాధ్యమాల ద్వారా చేస్తున్న వివాదాస్పద పోస్టులను అడ్డుకోవాలన్న పిటిషనర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సిక్కులు, ముంబై పోలీసులపై కంగన ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ముంబైకి చెందిన సర్దార్ చరణ్‌జీత్ సింగ్ అనే న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిన్న ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా పిటిషనర్‌కు ధర్మాసనం బదులిస్తూ.. కంగన రనౌత్ సామాజిక మాధ్యమాల ద్వారా చేస్తున్న వ్యాఖ్యల్ని అడ్డుకోలేమని స్పష్టం చేసింది.
ఆమె పోస్టులపై కోర్టులను ఆశ్రయించడానికి బదులుగా వాటిని పట్టించుకోవడం మానేయాలని, లేదంటే క్రిమినల్ చట్టాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. అలాగే, కంగన వ్యాఖ్యలపై దాఖలైన ఎఫ్ఐఆర్‌లు అన్నింటినీ కలిపి ముంబైలోని ఖర్ పోలీస్ స్టేషన్‌కు మార్చాలని సింగ్ అభ్యర్థించగా.. అలా కోరే అవకాశం కూడా అతడికి లేదని కోర్టు పేర్కొంది. అలా విజ్ఞప్తి చేసే అవకాశం నిందితులకు మాత్రమే ఉంటుందని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.