కరోనా ఎఫెక్ట్.. 55 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
- పెరుగుతున్న కరోనా కేసులతో నిర్ణయం
- ఈ నెల 24 వరకు ఆయా రైళ్లేవీ అందుబాటులో ఉండవన్న అధికారులు
- కాజీపేట-సికింద్రాబాద్ పుష్‌పుల్ రైలును అకస్మాత్తుగా రద్దుచేసిన అధికారులు
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మళ్లీ చెలరేగిపోతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. 55 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 24వ తేదీ వరకు ఈ రైళ్లేవీ అందుబాటులో ఉండవంటూ ఓ జాబితాను విడుదల చేసింది.
వీటిలో చిట్టాపూర్, సికింద్రాబాద్, కాజీపేట, హైదరాబాద్, బీదర్, కలబురిగి నడికుడి, కాచిగూడ కర్నూలు సిటీ, మేడ్చల్, ఉందానగర్, తిరుపతి, కాట్‌పాడి, గుంతకల్లు, డోన్, గుత్తి, రేపల్లె, తెనాలి, విజయవాడ, మచిలీపట్టణం, గుడివాడ, నిడదవోలు, నర్సాపూర్, బిట్రగుంట, చెన్నై సెంట్రల్ నుంచి ప్రారంభమయ్యే ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి.
కాగా, కాజీపేట-సికింద్రాబాద్ మధ్య నడిచే పుష్‌పుల్ రైలును నిన్న అకస్మాత్తుగా రద్దు చేయడంతో అప్పటికే స్టేషన్‌కు చేరుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.