మధుమేహ రోగులకు శుభవార్త.. దేశంలో అందుబాటులోకి ఓరల్ ట్యాబ్లెట్ ‘సెమాగ్లూటైడ్’
- ఇప్పటి వరకు ఇంజెక్షన్ల రూపంలో మాత్రమే అందుబాటులో
- అధిక బరువును తగ్గించడంలోనూ కీలక పాత్ర
- ఇంజెక్షన్ రూపం నుంచి ట్యాబ్లెట్‌గా మార్చేందుకు 15 ఏళ్లు
మధుమేహ బాధితులు.. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్‌తో బాధపడే వారికి ఇది శుభవార్తే. ఇప్పటి వరకు వీరికి ఇంజక్షన్ రూపంలో మాత్రమే అందుబాటులో ఉన్న ‘సెమాగ్లూటైడ్’ ఔషధం ఇప్పుడు నోటి మాత్రల రూపంలో అందుబాటులోకి వచ్చింది. ‘నోవో నోర్డిస్క్’ సంస్థ వీటిని భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రపంచంలోనే ఇది తొలి, ఏకైక నోటి మాత్ర కావడం గమనార్హం. టైప్-2 డయాబెటిస్‌తో బాధపడే వారిలో ఇది బ్లడ్ షుగర్‌ను అదుపులో ఉంచుతుంది. అంతేకాదు, బరువును తగ్గించడంలోనూ ఈ ట్యాబ్లెట్ కీలకంగా పనిచేస్తుందని నోవానార్డిస్క్ ఇండియా తెలిపింది.
ఈ ఔషధంపై భారత్ సహా పలు దేశాల్లో 10 ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్టు తెలిపింది. ట్రయల్స్‌లో పాల్గొన్న వారిలో 1000 మందికిపైగా భారతీయులేనని పేర్కొంది. అమెరికాలో ఈ ట్యాబ్లెట్‌కు 2019లోనే ఆమోదం లభించగా, భారత్‌లో డిసెంబరు 2020లో ఆమోదం లభించింది. కాగా, ఇప్పటి వరకు ఇంజెక్షన్ల రూపంలో ఉన్న సెమాగ్లూటైడ్‌ను ట్యాబ్లెట్ రూపంలో తీసుకొచ్చేందుకు నోవా నోర్డిస్క్ సంస్థకు 15 సంవత్సరాలు పట్టడం గమనార్హం.