అత్యున్నత పదవిలో ఉంటూ పచ్చి అవాస్తవాలు మాట్లాడటం ఏపీ సీఎస్ కు తగదు: సోమిరెడ్డి
- తప్పుడు లెక్కలు చెపుతూ ఉద్యోగుల నెత్తిన టోపీ పెడుతున్నారు
- ఉద్యోగుల డిమాండ్లు న్యాయబద్ధమైనవే
- ఉద్యోగులకు పూర్తి మద్దతు పలుకుతున్నానన్న సోమిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ ను సీఎస్ తప్పుదోవ పట్టిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలకు ఆయన నిన్న వివరణ ఇచ్చినప్పటికీ ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు ఏ మాత్రం తగ్గలేదు. సమ్మె దిశగా వారు అడుగులు వేస్తున్నారు. రేపు సీఎస్ ను కలిసి సమ్మె నోటీసులు అందజేయనున్నారు.
ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, సీఎస్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. అత్యున్నత పదవిలో ఉంటూ పచ్చి అవాస్తవాలు మాట్లాడటం సీఎస్ కు తగదని ఆయన అన్నారు. తప్పుడు లెక్కలు చెపుతూ ఉద్యోగుల నెత్తిన టోపీ పెట్టే ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని విమర్శించారు. ఉద్యోగులు చేస్తున్న డిమాండ్లన్నీ న్యాయబద్ధమైనవేనని అన్నారు. ఉద్యోగుల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు పలుకుతున్నానని చెప్పారు.