ముస్లింల నిఖా విందులో ఫుడ్ ఐటెమ్స్ కోత.. ఇక భగారా, చికెన్ లేదా మటన్, ఒక స్వీట్ అంతే.. వేములవాడ మసీదు కమిటీల తీర్మానం!
- వేములవాడలో 8 మసీదు కమిటీల తీర్మానం
- ఖర్చును నియంత్రించేందుకు నిర్ణయం
- వచ్చే నెల 1 నుంచే అమల్లోకి వస్తుందని ప్రకటన
ముస్లింల నిఖా అనగానే వారిచ్చే విందే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఎన్నెన్ని రకాల ఆహార పదార్థాలను వడ్డిస్తారో.. ఆ విందుకు వెళ్లిన వారికి తప్పకుండా తెలిసే ఉంటుంది. ఐదారుగురికో ప్రత్యేకమైన రౌండ్ టేబుల్ వేసి వడ్డిస్తుంటారు. బిర్యానీలు, మటన్, చికెన్, భగారా, రకరకాల స్వీట్లు, కెబాబ్ లతో బంధుమిత్రులకు నిఖా విందునిస్తారు. అయితే, దానికి ఖర్చు తడిసి మోపెడవుతుంటుంది.
అయితే, ఇకపై ఆ ఖర్చును తగ్గించేందుకు మసీద్ కమిటీల పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. అందుకు వేములవాడలోని షాదీ ఖానాలో 8 మసీద్ కమిటీల పెద్దలు సమావేశమయ్యారు. స్థానికంగా జరిగే విందుల్లో భగారాతో పాటు చికెన్ లేదా మటన్, ఒక స్వీటును మాత్రమే వడ్డించేలా తీర్మానించారు. గతంలోలాగా గంపెడు స్వీట్లు చేయకుండా ఏదైనా ఒకటే స్వీటు పెట్టాలని నిర్ణయించారు. ఈ తీర్మానం వచ్చేనెల ఒకటో తారీఖు నుంచే అమల్లోకి వస్తుందని ముస్లిం పెద్దలు పేర్కొన్నారు.