త్వరలో పెరగనున్న పీసీలు, ల్యాప్ టాప్ ల ధరలు

  • పెరిగిన తయారీ వ్యయాలు
  • 10-20 శాతం ధరలు పెరగొచ్చు
  • మార్కెట్ వర్గాల అంచనా
ల్యాప్ టాప్, పీసీల ధరలు త్వరలో పెరగనున్నాయి. గతంతో పోలిస్తే వీటి వినియోగం పెరగ్గా.. వీటి తయారీ వ్యయాలు కూడా అధికం కావడంతో కొనుగోలుదారులపై భారం పడనుంది.

ఈ ఏడాది పీసీలు, ల్యాప్ టాప్ ధరలు పెరగడానికి బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. వీటి తయారీకి వినియోగించే చిప్స్ (సెమీ కండక్టర్) తయారీ వ్యయాలు పెరిగాయని ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ తయారీ సంస్థ అయిన తైవాన్ సెమీ కండక్టర్ కంపెనీ (టీఎస్ఎంసీ) అంటోంది. 7ఎన్ఎం, 5ఎన్ఎం చిప్ తయారీ వ్యయాలు 10-20 శాతం వరకు పెరిగాయని చెబుతోంది.

ప్రపంచంలో అగ్రగామి కంపెనీలకు టీఎస్ఎంసీయే చిప్ లను సరఫరా చేస్తుంటుంది. ఈ విభాగంలో ప్రపంచంలో సగం వాటా ఈ కంపెనీ సొంతం. ఎఎండీ, ఇంటెల్, నివిడియాలకు ఇది సరఫరాదారుగా ఉంది.

కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత చాలా రంగాల్లో తయారీ ఖర్చు పెరిగిపోవడం చూస్తూనే ఉన్నాం. చిప్ లకు ప్రస్తుతం కొరత కూడా నడుస్తోంది. హార్డ్ వేర్ తయారీ ఖర్చు 20 శాతం మేర పెరిగినందున వినియోగదారులపై ఆ మేరకు భారం పడుతుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.


More Telugu News