కరోనా పరిహారం చెల్లింపు విషయమై ఏపీ సర్కారుపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. విచారణకు హాజరై వివరణ ఇచ్చిన సీఎస్!
- పూర్తి నిర్లక్ష్యం కనిపిస్తోంది
- కోర్టు ఆదేశాల అమలులో చిత్తశుద్ధి కనిపించడం లేదు
- క్లెయిమ్ రాకపోయినా పరిహారం ఇవ్వండి
- అన్ని రాష్ట్రాలకు సుప్రీం ఆదేశాలు
- క్షమాపణలు చెప్పిన ఏపీ సీఎస్ సమీర్ శర్మ
కరోనా మహమ్మారితో చనిపోయిన బాధితులకు పరిహారం పంపిణీ చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు వైఖరిని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ కేసు విచారణ బుధవారం సుప్రీంకోర్టులో జరిగింది. తొలుత ఏపీ చీఫ్ సెక్రటరీకి సమన్లు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం మధ్యాహ్నం తర్వాత విచారణ చేపట్టింది.
కరోనా బాధిత కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలంటూ లోగడ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను అన్ని రాష్ట్రాలు పాటించాల్సి ఉంటుంది. ‘‘ఆంధప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి ఈ విషయంలో పూర్తి నిర్లక్ష్యం కనిపిస్తోంది. ప్రభుత్వ అధికార యంత్రాంగం లెక్కల ప్రకారం 31,000 దరఖాస్తులకు అర్హత ఉండగా, కేవలం 11,000 దరఖాస్తు దారులకే చెల్లింపులు చేశారు. అంటే ఈ కోర్టు ఎప్పటికప్పుడు జారీ చేసే ఆదేశాలను అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా లేదు. కోర్టులు చప్పేంత వరకు స్పందించరా?’’అంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
కోర్టు సమన్లు అందుకున్న ఏపీ సీఎస్ సమీర్ శర్మ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుప్రీంకోర్టు విచారణకు హాజరై క్షమాపణలు చెప్పారు. ఈ అంశంలో పూర్తి బాధ్యత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. భాదితుల వివరాల్లో వయసు, చిరునామాలు సరిగా లేవని, వాటిని తనిఖీ చేస్తున్నామని వివరణ ఇచ్చారు. దీనికి జస్టిస్ ఎంఆర్ షా స్పందిస్తూ.. రికార్డులను అంత లోపభూయిష్టంగా నిర్వహిస్తున్నారా? అని నిలదీసింది. తప్పులను సరిచేస్తున్నామని, మరో రెండు వారాల్లో బాధితులు అందరికీ పరిహారం చెల్లిస్తామని కోర్టుకు సీఎస్ హామీ ఇచ్చారు. మరోసారి తప్పు జరిగితే కోర్టు ధిక్కరణ చర్యకు సిద్దమని పేర్కొన్నారు.
అధికారిక కరోనా మృతుల కంటే క్లెయిమ్ లు తక్కువ ఉన్న రాష్ట్రాల అంశాన్ని ప్రస్తావిస్తూ పరిహారం విషయంలో అవగాహన లేనట్టు తెలస్తోందని వ్యాఖ్యానించింది. కరోనా మరణాలుగా ధ్రువీకరించిన ప్రతి కేసులో బాధిత కుటుంబానికి క్లెయిమ్ దరఖాస్తుతో సంబంధం లేకుండా పరిహారం మంజూరు చేయాలంటూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.