50 రోజులు పూర్తి చేసుకున్న 'అఖండ'.. రూ.200 కోట్ల క్లబ్బులో చేరిక!
- డిసెంబర్ 2న విడుదలైన 'అఖండ'
- ఈ రోజుతో 50 రోజులు పూర్తి
- 103 థియేటర్లలో 50 రోజుల రికార్డు
- వివరాలతో అధికారిక పోస్టర్ విడుదల
బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన 'అఖండ', క్రితం నెల 2వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో 'సింహా' .. 'లెజెండ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్లు రావడం వలన, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక బాలకృష్ణ 'అఘోర'గా చేయడం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా మారింది.
విడుదలైన తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్లతో దూసుకుపోయింది. బాలకృష్ణ కెరియర్లోనే ఇంత వేగంగా జనంలోకి వెళ్లిన సినిమా మరొకటి లేదన్నట్టుగా వసూళ్ల డిజిట్స్ మారిపోతూ వచ్చాయి. సంక్రాంతికి కూడా ఈ సినిమాకి కొన్ని చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయంటే అర్థం చేసుకోవచ్చు.
ఈ రోజుతో ఈ సినిమా 103 థియేటర్లలో 50 రోజులను పూర్తి చేసుకుంది. 200 కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరిపోయింది. అందుకు సంబంధించిన విషయాలను తెలియజేస్తూ అధికారిక పోస్టర్ ను వదిలారు. బాలయ్య యాక్షన్ .. బోయపాటి టేకింగ్ .. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాధించడానికి కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.