ట్రైనీ ఐఏఎస్ అధికారులపై కరోనా పంజా.. 84 మందికి పాజిటివ్!

  • ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో కరోనా కలకలం
  • గుజరాత్ నుంచి వచ్చిన 480 మంది ట్రైనీ ఐఏఎస్ ల బృందం
  • కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 84 మందికి కరోనా
యావత్ దేశం కరోనా కోరల్లో నలుగుతోంది. ఏ ఒక్కరినీ వదలను అన్నట్టుగా మహమ్మారి వ్యాప్తి చెందుతోంది. తాజాగా ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో కరోనా కలకలం రేపుతోంది. శిక్షణ పొందుతున్న 84 మంది ట్రైనీ ఐఏఎస్ అధికారులకు కరోనా సోకింది. వీరందరికీ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని... ప్రస్తుతం వీరు ఐసొలేషన్ లో ఉన్నారని అధికారులు తెలిపారు. మొత్తం 480 మంది ట్రైనీ ఐఏఎస్ ల బృందం గుజరాత్ నుంచి అకాడమీకి చేరుకుంది. వీరికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా వారిలో 84 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.

మరోవైపు ఉత్తరాఖండ్ రాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో కూడా కరోనా కల్లోలం రేపుతోంది. డీజీపీ కార్యాలయంలో 25 మందికి కరోనా సోకింది. వీరికి కాంటాక్టులోకి వచ్చిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని డీజీపీ ఆదేశించారు. మరోవైపు కరోనా బారిన పడినవారంతా రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నవారేనని చెప్పారు.


More Telugu News